రామ్ సినిమా టైటిల్..
- July 12, 2016 / 02:38 PM ISTByFilmy Focus
హీరో రామ్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. టైటిల్ రూపంలోనే తన క్యారెక్టర్ చెప్పాలని ‘హైపర్’ అనే పేరును ఖరారు చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ సరసన రాశిఖన్నా నటిస్తోంది.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను వైజాగ్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. కందిరీగ వంటి హిట్ సినిమా తరువాత రామ్ మరోసారి సంతోష్ శ్రీనివాస్ తో చేస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ఎంత హైపర్ చూపిస్తాడో.. చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














