టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ఎప్పుడో చేరిన యువ కథానాయకుడు రామ్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. అదే రామ్ పెళ్లి గురించి. రామ్ తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడనేది ఆ పుకార్ల సారాంశం. రామ్ నుండి కానీ, ఆయన టీమ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, డీఫాల్ట్ ఈ వార్త నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. ఎట్టకేటకు రామ్ దీనిపై స్పందించాడు.
అది కూడా తనదైన సెటైరికల్ స్టైల్లో. ఎవరి పెళ్లి వారు చేసుకుంటారు కదా.. కానీ మన నెటిజన్లకు కంగారెక్కువ. ఫలానా హీరో పెళ్లికి అంతా రెడీ అయిపోయింది అని ఎక్కడో చిన్న పుకారు తీసుకొస్తారు. అది నిజమేననుకొని ఫ్యాన్స్ ఆ వార్తను చేరవేస్తుంటుంది మీడియా. ఈ క్రమంలోనే రామ్ పెళ్లి గురించి వార్త బయటికొచ్చింది. హైస్కూల్లో రామ్‌తో చదువుకున్న అమ్మాయినే రామ్ పెళ్లి చేసుకుంటాడని అన్నారు. అయితే తాను స్కూల్‌కి సరిగ్గా వెళ్లిందే లేదని, ఇంకా అక్కడ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుండి వస్తుంది అనే అర్థంతో రామ్ ట్వీట్ చేశాడు.
రెండ్రోజులుగా రామ్ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ న్యూస్ కన్ఫార్మ్ అనుకొని ఫ్యాన్స్ రామ్‌ను ఉద్దేశిస్తూ ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ‘ఆపండి రా బాబు మీ వల్ల నేను మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి కూడా నాకు ఎలాంటి సీక్రెట్ స్కూల్ గర్ల్ ఫ్రెండ్ లేదని క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు. నేను స్కూల్‌కి వెళ్లిందే చాలా తక్కువ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు రామ్. దీంతో ప్రస్తుతానికి క్లారిటీ వచ్చేసింది.
క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ, ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అనే విషయం మాత్రం చెప్పలేదు రామ్. అలాగే మరో ఏడాదో, రెండేళ్లలోనో పెళ్లి అనే సమాచారం కూడా ఇచ్చేసి ఉంటే బాగుంది ఉస్తాద్. ఈ సంగతి కూడా ఓసారి చూడొచ్చుగా.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!