అతి పెద్ద ప్రయోగాత్మక చిత్రం…..

టాలీవుడ్ యూత్ హీరోస్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు రామ్. తన కరియర్ తొలి రోజుల్లో వరుస హిట్స్ తో దూసుకుపోయిన రామ్, ఆ తరువాత వరుస పరాజయాలను చవి చూసాడు. అదే క్రమంలో ఈ ఏడాది వచ్చిన ‘నేను శైలజ’ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి రామ్ కు మళ్ళీ ఊపిరి పోసింది. ఇక మరో పక్క తన నెక్స్ట్ సినిమాపై తన అభిమానుల ఆలోచనలకు పూర్తి రివర్స్ లో ఆలోచిస్తున్నాడు రామ్.

ఇప్పటి వరకూ తన కరియర్ లో 13సినిమాలు చేసిన రామ్…తన 14వ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాడు. తనకు కందిరీగ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేస్తున్నాడు. ఇదిలా ఉంటే తన 15వ సినిమాను ఒక ప్రయోగాత్మక చిత్రంగా చేస్తున్నాడని చెబుతున్నాడు రామ్….దర్శకుడిగా అనిల్ రావిపూడిని ఎంచుకున్నాడు రామ్. ఇక ఆ సినిమా విషయాలు చెబుతూ….నా 15వ సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నానని అనౌన్స్ చేయడానికి సంతోషిస్తున్నా. ఇది చాలా స్పెషల్. బ్లైండ్ అయినా కమర్షియల్.’ అని ట్వీట్ చేశాడు.

ఇక దానికి అనిల్ రెస్పాన్స్ ఇస్తూ….’నా నెక్ట్స్ ఫిలింలో హీరో గుడ్డివాడు. కొత్తగా ట్రై చేస్తున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ కావు’ అని చెప్పుకొచ్చాడు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కధను ఎంచుకోవడం నిజంగా చాలా డేర్ ఉన్న ప్రయత్నం అనే చెప్పాలి…మరో పక్క కమర్షియల్ సినిమాలో హీరో గుడ్డివాడు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని ఆలోచిస్తారు హీరోలు కానీ రామ్ మాత్రం వెంటనే ఓకే చెప్పేసి సంతకం పెట్టేసాడు అంటే అనిల్ ఇచ్చిన స్క్రిప్ట్ అంత పక్కగా ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ప్రయోగం వీళ్ళిద్దరికీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus