టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన నిశ్చితార్థం నేడు ఘనంగా జరగబోతుందని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు శర్వానంద్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది ఈయన నిశ్చితార్థ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. నటుడు శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శర్వానంద్ రాంచరణ్ ఇద్దరు హీరోలు మాత్రమే కాకుండా వీరు చిన్నప్పటినుంచి కూడా ఎంతో మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే శర్వానంద్ నిశ్చితార్థంలో రామ్ చరణ్ దంపతులు హాజరై సందడి చేశారు. నేడు శర్వానంద్ రక్షిత రెడ్డిల నిశ్చితార్థ వేడుక ఎంతో వైభవంగా జరిగింది.రక్షిత రెడ్డి తెలంగాణకు చెందిన అమ్మాయి అనే విషయం మనకు తెలిసిందే. ఈమె హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె.
ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాన్ని చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే రక్షిత రెడ్డి ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందని తెలుస్తోంది.ఇన్ని రోజులు బ్యాచిలర్ లైఫ్ లో ఎంతో ఎంజాయ్ చేసిన శర్వానంద్ పొలిటికల్ ఫ్యామిలీలోకి అల్లుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నేడు ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న శర్వానంద్ వేసవిలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో నేటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?