Sharwanand Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న శర్వానంద్.. అమ్మాయి ఎవరంటే?

  • January 5, 2023 / 10:05 AM IST

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో శర్వానంద్ కూడా ఒకడన్న సంగతి తెలిసిందే. కోవిడ్ లాక్ డౌన్ టైంలో నిఖిల్, నితిన్ వంటి యంగ్ హీరోలు పెళ్లి చేసుకున్నారు.వీరితో పాటు ఎప్పుడూ పెళ్లి ఊసెత్తిన రానా కూడా పెళ్లి చేసుకున్నాడు. ప్రభాస్ అయితే పెళ్లి చేసుకుంటాడో లేదో అంచనా వేయడం కష్టంగా ఉంది. అన్ స్టాపబుల్ లో మాత్రం బాలయ్యతో పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే శర్వానంద్‌కు పెళ్లి కుదిరింది.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ ఎన్నారై అమ్మాయిని అతి త్వరలో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ప్రేమ పెళ్ళా? అనే డౌట్ మీకు రావచ్చు. కానీ కాదు ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతేకాదు శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి… రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది. యూఎస్ లో పనిచేసే ఈ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుందట. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని సమాచారం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ తో డీసెంట్ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చిన శర్వానంద్ ప్రస్తుతం ఏ ప్రాజెక్టుని ఓకే చేయలేదు. ‘ఒకే ఒక జీవితం’ కి ముందు వరుసగా 5 ఫ్లాపులు ఫేస్ చేశాడు శర్వానంద్.కృష్ణ చైతన్య దర్శకత్వంలో సినిమా ఫైనల్ అయినట్టు వార్తలు వచ్చాయి కానీ.. దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.’ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ గ్యాప్ తీసుకున్నాడని మాత్రం స్పష్టమవుతుంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus