నటుడిగా నన్ను మరికొన్ని మెట్లు ఎక్కించే చిత్రం ‘బిగ్ బ్రదర్’ : శివ కంఠంనేని

చాలా విరామం తర్వాత తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ… దర్శకసంచలనం, “రాజమౌళి ఆఫ్ భోజపురి” గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్”. రేపు (మే 24న) ప్రేక్షకుల ముందుకు రానుంది. “లైట్ హౌస్ సినీ మ్యాజిక్” పతాకంపై కె.ఎస్.శంకర్ రావు – ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రతిభాశాలి – అవార్డ్స్ విన్నింగ్ పెర్ఫార్మర్ శివ కంఠంనేని టైటిల్ పాత్ర పోషించారు. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఘంటా శ్రీనివాసరావు కార్యనిర్వాహక నిర్మాత. శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించింది!!

ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర కథానాయకుడు శివ కంఠంనేని మాట్లాడుతూ… “గోసంగి సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే యాక్షన్ ఎంటర్టైనర్ “బిగ్ బ్రదర్”. ఈ చిత్రం నటుడిగా నన్ను మరి కొన్ని మెట్లు ఎక్కిస్తుంది. నటుడిగా నాకు మళ్ళీ అవార్డులు తెచ్చే ఈ చిత్రం మా నిర్మాతలకు రివార్డులు కూడా తెచ్చిపెట్టి, వారు మరిన్ని మంచి సినిమాలు తీసేందుకు దోహదపడుతుంది” అన్నారు!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus