Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ట్రైలర్.. అక్టోబర్ 6న చిత్రం విడుదల

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ట్రైలర్.. అక్టోబర్ 6న చిత్రం విడుదల

  • October 2, 2023 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఏందిరా ఈ పంచాయితీ’ ట్రైలర్.. అక్టోబర్ 6న చిత్రం విడుదల

భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రాబోతోంది. ఇందులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతులు మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయించారు మేకర్లు.

ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. కొత్త టీం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించింది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఇక ఈ ట్రైలర్‌లో.. ‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు.. ఆధారాలు లేనివి అబద్దాలు కావు’ అంటూ పోలీస్ పాత్ర చెప్పే డైలాగ్‌తో ఇందులో క్రైమ్, సస్పెన్స్ అంశాలున్నాయని తెలుస్తోంది.. ‘కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి.. ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే.. పెళ్లితో మొదలయ్యే ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా’ అని ‌హీరోయిన్‌తో తండ్రి చెప్పే మాటల్లో ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉందనిపిస్తుంది.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే అంటూ హీరో ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ చూస్తే.. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అని అర్థం అవుతోంది.

ఈ ట్రైలర్‌లో విజువల్స్ ఎంతో సహజంగా ఉన్నాయి. ఊరి వాతావరణాన్ని, అందాలను చక్కగా చూపించారు కెమెరామెన్. ఆర్ఆర్ కూడా ఎంతో బాగుంది. మాటలు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #endira ee panchayithi
  • #Tollywood

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 hour ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

2 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

3 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

4 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

14 mins ago
Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

51 mins ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

2 hours ago
Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

2 hours ago
Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version