హీరో సుమంత్ ఇప్పటికే విడాకులు తీసుకున్నారు. నటి కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో పెళ్లైన కొన్నాళ్లకే ఆమెకి దూరమయ్యారు. ఆ తరువాత కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. కానీ సుమంత్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నారు. ఇప్పుడు ఈ హీరో విడాకులపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయిందని అంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు.
నా ఫ్యామిలీలో కూడా విడాకులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ విషయంలో నేను దురదృష్టం అనే పదం కూడా వాడదలుచుకోలేదు. అలా జరుగుతున్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ అడ్జెస్ట్ అయిపోతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే బ్యాడ్ ఇమేజ్ పడిపోతుందని ఫీల్ అవుతారని.. అందుకే రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలనే అనుకుంటారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది విడాకుల కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. అందుకే సుమంత్ సినిమా ప్రమోషన్స్ లో విడాకుల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో వర్షిణి, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11న జీ5 ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!