Suriya: కష్టాల్లో ఫ్యాన్స్.. బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసిన హీరో

  • June 10, 2021 / 12:27 PM IST

హీరో సూర్యను అభిమానులు ఎంతగా ఇష్టపడతారో.. అంతకంటే ఎక్కువగా సూర్య అభిమానులను లైక్ చేస్తాడు. ఎంతగా అంటే అభిమానుల చేతనే గొప్ప పనులు చేయించేంతలా.. అవసరం అయితే వారికి అండగా ఉండేంతలా. ఇప్పటికే సూర్య ఒక స్వచ్చంద సంస్థలో ఎంతోమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల కరోనా లాక్ డౌన్ వలన ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.

ఇక తన అభిమానుల్లో కూడా కొంతమంది ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకున్న సూర్య వెంటనే వారి కోసం 12.5లక్షల రూపాయలను విరాళం అందించడానికి సిద్ధమయ్యాడు. ఫ్యాన్స్ క్లబ్ లో ఉన్న 250మందికి పైగా అభిమానులకు 5000రూపాయల చొప్పున అంధించనున్నాడు. మధ్యవర్తుల ద్వారా కాకుండా సూర్య తన ట్రస్ట్ నుంచే డైరెక్టర్ గా అభిమానుల ఖాతాలో డబ్బు వేసేలా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. అభిమానుల కోసం ఈ విధంగా సహాయం చేయడం నిజంగా మంచి పరిణామం అని చెప్పవచ్చు.

ఈ కష్టకాలంలో చాలామంది కాస్త సహాయం దొరికినా కూడా చాలు అనుకుంటున్నారు. ఇక సూర్య ఈ విదంగా తనకు మద్దతుగా నిలిచే అభిమానుల కోసం సహాయం అందించడంతో ఆయనను అభిమానులకు మరింత దగ్గర చేస్తోంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus