టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని హీరోలలో సుశాంత్ (Sushanth) ఒకరు. కాళిదాస్, కరెంట్, అడ్డా (Adda) , చి ల సౌ మరికొన్ని సినిమాలలో సుశాంత్ నటించారు. భారీ బడ్జెట్ సినిమాలలో కీలక పాత్రలలో నటించడానికి సైతం సుశాంత్ అంగీకరిస్తున్నారు. తన సినీ కెరీర్ లో సుశాంత్ వివాదాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. తాజాగా సుశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోను పోస్ట్ చేశారు.
ఆ ఫోటోకు క్యాప్షన్ లేదు? పరవాలేదుగా? అని సుశాంత్ పోస్ట్ పెట్టగా ఒక నెటిజన్ “నువ్వు లేకపోయినా పరవాలేదు” అంటూ రియాక్ట్ అయ్యారు. అయితే ఇలా హద్దులు మీరు కామెంట్లు చేస్తే సెలబ్రిటీలు మెజారిటీ సందర్భాల్లో సీరియస్ కావడం జరుగుతుంది. అయితే సుశాంత్ మాత్రం ఆ నెటిజన్ కామెంట్ విషయంలో సాఫ్ట్ గా రియాక్ట్ అయ్యారు. “నీలాంటి వాళ్లు ఉండాలి” అంటూ సుశాంత్ మంచి మనస్సును చాటుకుంటూ చేసిన కామెంట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తానని ఆయన తెలిపారు. సుశాంత్ పలు వెబ్ సిరీస్ లలో సైతం నటించారు. సుశాంత్ కెరీర్ మరింత పుంజుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుశాంత్ అక్కినేని హీరోలతో కలిసి నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుశాంత్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆయనకు తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ల నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుశాంత్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. సుశాంత్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సుశాంత్ గెస్ట్ రోల్స్ లో నటించినా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడితే బాగుంటుందని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.