ఈ టైములో తరుణ్ సినిమాలను పట్టించుకుంటారా..!

  • March 23, 2021 / 04:59 PM IST

థియేటర్లు ఎప్పుడైతే తెరుచుకున్నాయో.. అప్పటి నుండీ వారానికి రెండేసి, మూడేసి సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పట్లో సోలో రిలీజ్ దక్కించుకునే అవకాశం హీరోలకు లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క పెద్ద హీరో సినిమాలకు మాత్రమే సోలో రిలీజ్ దక్కుతుంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలి కాబట్టి..! ఇక మిగిలిన శుక్రవారాలు అన్నీ మీడియం రేంజ్ హీరోలకే..!ఇలాంటి టైములో ఫేడౌట్ అయిపోయిన హీరోలు రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే చాలా కష్టమనే చెప్పాలి.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. హీరో తరుణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడట. అది కూడా హీరోగానే..! అసలే ఫేడౌట్ అయిపోయిన హీరో.. ఇప్పుడు అతని సినిమాలను బయ్యర్లు కొనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇలాంటి టైములో మంచి యాక్టర్ గా తరుణ్ ప్రూవ్ చేసుకుని తరువాత హీరోగా చేస్తే బాగుంటుంది కానీ..మళ్ళీ హీరోగా అంటే కష్టమే కదా..! నిజానికి 2018లోనే ఇతను ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

అసలు ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఇక ఇప్పుడు తన స్నేహితుడుని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. ఓ సినిమా చెయ్యబోతున్నాడట. నిర్మాత కూడా దొరికాడని తెలుస్తుంది. ఒకవేళ అతను హ్యాండ్ ఇచ్చినా.. తనే ఈ చిత్రాన్ని నిర్మించాలని డిసైడ్ అయ్యాడట తరుణ్. 2 నెలల్లోనే సినిమాని పూర్తి చేసి రిలీజ్ చెయ్యబోతున్నట్టు టాక్. మరి ఆ సినిమాని జనాలు ఎంతవరకూ పట్టించుకుంటరో చూడాలి..!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus