సరికొత్త ప్రయోగం చేస్తున్న దర్శకుడు సుకుమార్..!

Advertisement

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో లవర్ బాయ్ తరుణ్ పాత్ర కూడా ఉంటుందా? అంటే.. అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యనే ఆహా ఓటీటీ లో ‘అనుకోని అతిథి’ అనే చిత్రం విడుదలయ్యింది. ఇందులో మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించాడు. తెలుగులో అతని పాత్రకి లవర్ బాయ్ తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. అది సూపర్ గా సెట్ అయ్యింది.

నేషనల్ అవార్డు విన్నర్ ఆర్టిస్ట్ కు డబ్బింగ్ చెప్పడం అంటే అంత సాధారణ విషయం ఏమీ కాదు.అయితే తరుణ్ తన నైపుణ్యంతో ఆ టాస్క్ ను చాలా ఈజీగా పూర్తి చేసాడు.దాంతో అతనికి ‘పుష్ప’ సినిమాలో కూడా అవకాశం ఇవ్వాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నాడట. అలా అని ‘పుష్ప’ లో తరుణ్ కనిపించడు. అందులో కూడా ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప రాజ్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఫాజిల్ కనిపించబోతున్నాడు. కాబట్టి అతని పాత్రకు తరుణ్ తో డబ్బింగ్ చెప్పిస్తే స్పెషల్ గా ఉంటుందని సుకుమార్ భావిస్తున్నాడట.

ఈ విషయం పై అల్లు అరవింద్ గారితో అలాగే అల్లు అర్జున్ లతో చర్చలు కూడా జరిపారు సుకుమార్. అయితే పాజిల్ పాత్రకు సంబంధించి ‘పుష్ప’ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.సరిగ్గా మొదలయ్యే టైం కి కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వచ్చి పడింది. ‘అతనికి సంబంధించి రెండు, మూడు ఎపిసోడ్స్ షూట్ చేసాక.. వాటికి తరుణ్ తో డబ్బింగ్ చెప్పించి.. అవి ఓకే అనుకుంటే ఫైనల్ చేస్తే బాగుంటుంది’ అని అల్లు అరవింద్.. సుకుమార్ కు సూచించారు. కాబట్టి.. తరుణ్ ఫైనల్ అయ్యింది లేనిది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus