విశాల్-అనిషాల పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా ?

  • August 22, 2019 / 11:55 AM IST

స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లిళ్లు, ఎంగేజ్ మెంట్లు బ్రేక్ అవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది. నాగచైతన్య-సమంత మినహా ఈమధ్యకాలంలో సక్సెస్ ఫుల్ లవ్ మ్యారేజ్ లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఈ బ్రేకప్ బాటలో పడ్డారు విశాల్ & అతనికి కాబోయే భార్య అనీషా. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో తెలియదు కానీ.. పెద్దల సమక్షంలో ఘనంగా ఎంగేజ్ మెంట్ మాత్రం జరిగింది. విశాల్-అనీషాల పెళ్లి నిశ్చయమవ్వడం తమిళ జనాలకు పెద్ద షాక్. ఎందుకంటే.. అప్పటివరకూ విశాల్-వరలక్ష్మి ప్రేమలో ఉన్నారని.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయిన సమయంలో ఇలా బాంబ్ పేల్చాడు విశాల్.

“అర్జున్ రెడ్డి, పెళ్ళిచూపులు” చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన అనీషా సంపన్న కుంటుంబానికి చెందిన అమ్మాయి. మార్చి 16న హైద్రాబాద్ లో ఘనంగా విశాల్-అనీషాల ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని జనాలు ఎదురుచూస్తున్న టైమ్ లో.. వీళ్ళిద్దరి ఎంగేజ్ మెంట్ రద్దైందని.. పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అనీషా ఇన్స్టాగ్రామ్ లో విశాల్ తో తాను ఉన్న ఫోటోలు మరియు ఎంగేజ్ మెంట్ ఫోటోలన్నీ డిలీట్ చేయడమే ఇందుకు ముఖ్యకారణం. వీళ్ళ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమిటి అనేది ఇంకా తెలియనప్పటికీ.. ప్రస్తుతానికి విశాల్ మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వకుండా ఉండడానికి చాలా కష్టపడుతున్నాడని వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus