అర్జున్ రెడ్డి రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్!

  • October 10, 2017 / 08:38 AM IST

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది.   విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గా అదరగొట్టారు. అతని క్యారక్టర్ తెలుగు వారితో పాటు ఇతర భాషల వారికీ కూడా బాగా నచ్చింది.  అందుకే ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ముందుగా తమిళ రీమేక్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయి. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ అర్జున్ రెడ్డిగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ద్వారా ధ్రువ్ హీరోగా పరిచయం కానున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాల డైరెక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని విక్రమ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ పెరిగే మరో న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో హీరోయిన్ గా కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ నటించ బోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్షర హాసన్ ఈ మూవీ ద్వారా బ్రేక్ అందుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus