మరో ప్లాప్ హీరోయిన్ కు అవకాశం ఇవ్వబోతున్న పవర్ స్టార్..!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా గడుపుతునే ఇప్పుడు తిరిగి సినిమాల్లో కూడా బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ‘పింక్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓ మై ఫ్రెండ్’ ‘ఎం.సి.ఏ’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వేణుశ్రీరామ్ ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, బోణి కపూర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చేస్తూనే మరో పక్క తన 27వ చిత్రాన్ని కూడా చేయడానికి పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా ఏ.ఎం.రత్నం నిర్మించనున్నారు.

ఈ నెల అంటే జనవరి 27 ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ఇక హీరోయిన్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమాత్రం డైరెక్టర్ లను, నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడు అన్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ హీరోయిన్లే కావాలని పట్టు పట్టడు.. ప్లాప్ హీరోయిన్ లు అయినా ఓకే చెప్పేస్తాడు. గతంలో కృతీ కర్బంద, ప్రణీత, అనూ ఇమ్మాన్యు యేల్ వంటి ప్లాప్ హీరోయిన్ లకు కూడా పవన్ అవకాశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన 27 వ చిత్రానికి కూడా ఓ ప్లాప్ హీరోయిన్ ను ఎంచుకోబోతున్నాడని తెలుస్తుంది. ‘కంచె’ ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైన ప్రగ్యా జైస్వాల్.. ఆ ప్లాప్ హీరోయిన్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు లేవు.. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. ఆమెకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus