పవన్ తో పోటీగా బాలీవుడ్ బ్యూటీ!

  • March 12, 2021 / 03:25 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. కథ ప్రకారం ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పవన్ ఒక్కడే కాదు.. హీరోయిన్ కూడా దొంగగా కనిపిస్తుందట. అయితే ఆ హీరోయిన్ నిధి అగర్వాల్ కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.

నిధి అగర్వాల్ రాకుమారి తరహా పాత్రలో కనిపిస్తుండగా.. జాక్వెలిన్ మాత్రం దొంగగా కనిపిస్తుందట. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని.. పవన్ తో పోటీ పడుతూ హీరోయిన్ దొంగతనాలు చేస్తుందని సమాచారం. వీరి కాంబినేషన్ సీన్లు చాలా వినోదాత్మకంగా రాసుకున్నాడట దర్శకుడు క్రిష్. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ వజ్రానని దోచుకోవడానికి వీరమల్లు చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా కథకు కావాల్సినట్లుగా భారీ సెట్స్ ను రూపొందిస్తున్నారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ మినార్ సెట్లను నిర్మిస్తున్నారు. ఔరంగజేబు కాలం నాటి కట్టడాలన్నింటికీ.. ఈ సినిమాలో చూపించి.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని ఆ కాలానికి తీసుకెళ్లే విధంగా క్రిష్ ఓ కంచు కోట సిద్ధం చేస్తున్నాడట. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus