Naga Chaitanya: అన్నపూర్ణ స్టూడియోలో చైతూ వివాహం.. ఎందుకంటే?

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) శోభిత ధూళిపాల  (Sobhita Dhulipala) ఇటీవల నిశ్చితార్థం వేడుకతో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. చాలా కాలం క్రితం నుంచే ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు. అయితే ఎక్కడ కూడా విషయంపై ఈ జోడి క్లారిటీ ఇవ్వలేదు. ఫైనల్ గా అతికొద్దీ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని సర్ ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇక వీరి పెళ్లి వేడుకకు ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Naga Chaitanya

అయితే ఎక్కడ పెళ్లి వేడుక జరగబోతోంది అనే విషయంలో అనేక రకాల గాసిప్స్ అయితే కొట్టుకొచ్చాయి. మొదట అయితే విదేశాల్లోనే వీరి వివాహం జరగనున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అలాగే గోవాలో కూడా ప్లాన్ చేసినట్లు మరికొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. నాగచైతన్య నాగార్జున (Nagarjuna)  నిర్ణయం ప్రకారం హైదరాబాదులోనే పెళ్లి వేడుక జరగబోతుంది. అది కూడా వారికి ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోనే వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి చేసుకోవడం వెనుక బలమైన సెంటిమెంట్ కూడా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడింది. మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తెలుగు సినిమా తరలిరావడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఒక ముఖ్య కారణం. ఆ సంస్థలో ఎన్నో జీవితాలు మలుపు తిరిగాయి. ఎన్నో వందల సినిమాల్లో రూపొందించారు. మరెన్నో సినిమాల షూటింగ్స్ కూడా అక్కడే జరిగాయి.

అక్కినేని ఫ్యామిలీకి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అయిన మనం సినిమా కూడా అక్కడ సెట్ లో నిర్వహించారు. ఇక నాగేశ్వరరావు చివరి క్షణాల్లో కూడా ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియోలోనే కొనసాగారు. నాగార్జున తల్లి పేరుతో ఉన్న ఆ స్టూడియోలో తండ్రి ఆశీస్సులు కూడా బలంగా ఉంటాయని అక్కినేని వారి నమ్మకం. ఇంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా పెళ్లి వేడుకలు నిర్వహించాలని నాగార్జున డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. డిసెంబర్లోనే వీరి పెళ్లి వేడుక జరగబోతున్నట్లు సమాచారం.

మహేష్ విషయంలో రాజమౌళి డిసిషన్ మంచిదే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus