Kanguva First Review: సూర్య ‘కంగువా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ (Kanguva). ‘సిరుతై’ శివ (Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘స్టూడియో గ్రీన్’ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ విలన్ గా నటించాడు. ‘కంగువా’ (Kanguva) పాన్ ఇండియా మూవీగా రూపొందింది. తమిళ, తెలుగు, భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఆంధ్రా రీజన్లో విడుదల చేస్తుంది.

Kanguva First Review

నైజాం రైట్స్ ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ తీసుకుంది. నవంబర్ 14 న చాలా గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఈ సినిమా. టీజర్, ట్రైలర్స్ బాగా ఇంప్రెస్ చేశాయి. అందులోని విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. దీంతో ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ‘కంగువా’ సినిమా. ఆల్రెడీ కొంతమంది సినీ పెద్దలకి ఈ సినిమాని చూపించడం జరిగింది.

వారి టాక్ ప్రకారం.. ఇది ఒక ఫాంటసీ మూవీ అట. సూర్య (Suriya) రెండు రకాల పాత్రల్లో కనిపించాడట. అందులో ఒకటి కంగువా అనే యోధుడి పాత్ర అని.. తన ప్రజల కోసం ఓ దుర్మార్గుడితో పోరాడే పాత్ర అది అని అంటున్నారు. అయితే అతను వర్తమానంలోకి రావడం.. అందుకు గల కారణాలు ఏంటి? అతనిలా ఉన్న ఫ్రాన్సిస్ ఏం చేస్తూ ఉంటాడు? అతని లైఫ్.. ‘కంగువా’ వల్ల ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది కథ అని అంటున్నారు.

సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సూర్య (Suriya) యాక్టింగ్ సూపర్ అట. విజువల్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు. క్లైమాక్స్ కూడా చాలా బాగుందట. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

వరుణ్ తేజ్ ‘మట్కా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus