మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ‘మట్కా’ (Matka) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా నోరా ఫతేహి కీలక పాత్ర పోషించింది. ‘మట్కా’ (Matka) టీజర్, ట్రైలర్లకి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
జీవీ ప్రకాష్ (Gv Prakash Kumar) సంగీతంలో రూపొందిన పాటలు కూడా పర్వాలేదు అనిపించాయి. ఇక ‘మట్కా’ (Matka) సినిమాని కొంతమంది టాలీవుడ్ పెద్దలు చూడటం జరిగింది. అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం..1958 నుండి 1982 మధ్యలో వైజాగ్లో జరిగిన కథ ఇది అని తెలుస్తుంది. వాల్తేరుకి చెందిన వాసు(వరుణ్ తేజ్) ఓ కూలీ. అయితే అతను తప్పు లేకుండా జైలుకి వెళ్తాడు. దాని వల్ల కఠినంగా మారిపోతాడు. బయటకు వచ్చాక డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటాడు.
ఈ క్రమంలో ఒకసారి క్లబ్ వెళ్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ స్టైల్ మారిపోతుంది. అది ఎలా? సుజాతతో(మీనాక్షి చౌదరి) అతని ప్రేమ, పెళ్లి… ఆ తర్వాత సోఫియా(నోరా ఫతేహి) వల్ల చోటు చేసుకున్న పరిస్థితులు..! ఇవే ప్రధానంగా ‘మట్కా’ సినిమా రూపొందినట్లు చెబుతున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 రకాల లుక్స్ లో కనిపించాడట. ఇది అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటున్నారు. డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉందని చెబుతున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంటుందట. కరుణ కుమార్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా, ఇన్స్పిరేషనల్ గా ఉంటాయని సమాచారం. మరి మార్నింగ్ షోలు పడ్డాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.