Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » ఎవిక్షన్ ఫ్రీ పాస్ హైడ్రామా..! రాజ్ అందుకే ఎలిమినేట్ అయ్యాడు..!

ఎవిక్షన్ ఫ్రీ పాస్ హైడ్రామా..! రాజ్ అందుకే ఎలిమినేట్ అయ్యాడు..!

  • November 27, 2022 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవిక్షన్ ఫ్రీ పాస్ హైడ్రామా..! రాజ్ అందుకే ఎలిమినేట్ అయ్యాడు..!

బిగ్ బాస్ హౌస్ లో సండే ని ఫన్ డే అని హోస్ట్ అంటే, బిగ్ మాస్ మాత్రం దానిని ఎలిమినేషన్ డేగా మారుస్తాడు. ఎలిమినేషన్ లో హౌస్ మేట్స్ మద్యలో ఉత్కంఠ, అలాగే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేటపుడు ఎమోషన్ అన్నీ కలగలిపి ఉంటాయి. ఇక 12వ వారం బిగ్ బాస్ హౌస్ లో రాజ్ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే, రాజ్ ఎలిమినేట్ అయ్యేటపుడు హైడ్రామా నెలకొంది. దీనికి కారణం ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటమే. నిజానికి ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం ఫైమా పెద్దగా ఫైట్ చేయలేదు.

రేవంత్, ఇంకా శ్రీహాన్ ఇద్దరికీ దక్కకుండా మిగతా హౌస్ మేట్స్ ఫైమాకి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి, రాజ్ ఫైమా వెంట నిలబడ్డారు. దీంతో ఫైమాకి ఎవిక్షన్ ఫ్రీపాస్ వచ్చింది. అయితే, ఇది తనకోసం వాడుతుందా లేదా వేరేవాళ్ల కోసం వాడుతుందా అనేది హౌస్ మేట్స్ మద్యలో సందేహంగానే ఉంది. ఫ్యామిలీ ఎపిసోడ్ జరిగేటపుడు ఫైమా మదర్ వచ్చి తనకోసమే ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని వాడమని క్లియర్ గా చెప్పింది.

ఆదివారం ఎపిసోడ్ లో ఫైమా ఇంకా రాజ్ చివరకి వరకూ నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా హౌస్ మేట్స్ ఉత్కంఠగా ఎదురుచూశారు. చివరకి ఫైమా ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడి సేఫ్ అయ్యింది. రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి అన్ అఫీషియల్ పోలింగ్స్ లో మనం చూసినట్లయితే, ఫైమా ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది. ఫైమా – రాజ్ లాస్ట్ వరకూ ఉన్నప్పుడు హోస్ట్ నాగార్జున ఫైమాకి పాస్ వాడమని అవకాశం ఇచ్చాడు. దీంతో ఫైమా ఫస్ట్ రాజ్ కోసం ఇది వాడతాను అని చెప్పింది.

కానీ, నాగార్జున ఒక్కసారి ఫైమా మదర్ ఏమన్నదో గుర్తుచేశాడు. దీంతో తన నిర్ణయాన్ని మార్చుకుని తనకోసం ఈ పాస్ ని వాడి సేఫ్ అయ్యింది. దీంతో రాజ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఓటింగ్ లో రాజ్ కూడా బాగా వెనకబడిపోయాడు. ఫైమా తర్వాత రాజ్ లీస్ట్ లో ఉన్నాడు. అలాగే, ఆదిరెడ్డి కూడా ఈవారం డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఎవిక్షన్ ఫ్రీపాస్ వల్లే కేవలం ఫైమా ఈవారం సేఫ్ అయ్యింది.
నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు.

ఎందుకంటే, ఫైమా ఎవిక్షన్ ఫ్రీపాస్ తో సేఫ్ అయితే, వేరేవాళ్లని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేసేందుకు వీలు ఉంటుంది. కానీ, ఎందుకో బిగ్ బాస్ టీమ్ ఈసారి సింగిల్ ఎలిమినేషన్ చేశారు. హౌస్ లో ప్రస్తుతం 8మంది ఉన్నారు. ఇంకా రెండు వారాలు మాత్రమే ఉన్నాయి. ఈ టైమ్ లో సింగిల్ ఎలిమినేషన్ చేస్తే వచ్చే వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ చేయాలి. మరి బిగ్ బాస్ టీమ్ ఫినాలేకి ఎలాంటి ప్లాన్ చేస్తుందనేది చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Faima
  • #Rajasekhar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

3 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

4 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

15 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

16 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

32 mins ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

51 mins ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

19 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

21 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version