టాలీవుడ్ సింహం…నట సింహం నందమూరి బాల కృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి…దాదాపుగా 99 సూపర్ సినిమాల తరువాత బాలయ్య చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చేసింది…అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఈ సినిమా విషయంలో బాలయ్య రిస్క్ చేస్తున్నాడు అని అనుకున్నప్పటికీ బాలయ్య ఫర్స్ట్ లుక్, టీజర్ చూడగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి…ఇంకా చెప్పాలి అంటే సంక్రాంతి బరిలో నిలుస్తున్న మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బిజినెస్ పీక్స్ లో ఉంది అంటే నమ్మక తప్పని నిజం.
అయితే అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావొస్తున్న వేళ వచ్చే నెల 9న ఈ ట్రైలర్ విడుదల చేసి….ఆ తరువాత ఈ సినిమా ఆడియో వేడుకను అంగ రంగా వైభవంగా జరిపేందుకు పక్కా ప్లాన్ తో ఉన్నారు చిత్ర యూనిట్. అంతేకాదు…ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖలు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పోస్టర్స్ దర్శనమివ్వనున్నాయి. ఇక ఇప్పటికీ సినిమా ప్రీ రిలీజ్ బీజెస్ ఆల్మోస్ట్ క్లోస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో వేడుకని…తిరుపతిలో నిర్వహించాలి అని ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్ ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధులుగా…రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు….కేసీఆర్ ఇద్దరినీ ఆహ్వానించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ఆడియో వేడుక ఎంతటి ప్రాధాన్యతని సంతరించుకుంటుందో…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.