Ram Charan, Shankar: చరణ్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

  • May 19, 2021 / 07:52 PM IST

దిల్ రాజు నిర్మాతగా శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఆ తేదీ లోపు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. శంకర్ ఈ సినిమా కథను ఎమోషనల్ సీన్స్ తో భారీ యాక్షన్ సీన్స్ తో తయారు చేశారని సమాచారం. ఈ సన్నివేశాలే సినిమాకు హైలెట్ కాబోతున్నాయని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారని శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం. దిల్ రాజు సైతం శంకర్ ను తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాను తీయాలని కోరినట్టు తెలుస్తోంది.

సినిమాలో చరణ్ డ్యాన్స్ లు హైలెట్ అయ్యే విధంగా శంకర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపిస్తుండగా కియారానే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇండియన్2 షూటింగ్ ఎప్పుడు మొదలైనా ఆ సినిమా పనులను వేగంగా పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో శంకర్ చరణ్ సినిమా తెరకెక్కనుందని గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రాధాన్యత ఉండదని సమాచారం.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus