Himaja: ఆ మ్యాటర్ లీక్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ హిమజ!

  • January 27, 2022 / 04:37 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న హిమజకు ఆ షో తర్వాత సినిమా ఆఫర్లు పెరిగాయి. హిమజ ప్రస్తుతం తన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం హిమజ డ్రీమ్ హౌస్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేయగా ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా హిమజ యాక్టివ్ గా ఉంటున్నారు.

తాజాగా హిమజ టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమా ఈవెంట్ కు హాజరై పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయని అన్నారు. తాను పదో తరగతి చదువుతున్న సమయంలో ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడని హిమజ చెప్పుకొచ్చారు. అయితే తనకు లవ్ ప్రపోజ్ చేసిన అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి ఆ అబ్బాయి పేరును మాత్రం చెప్పాలని అనుకోవడం లేదని హిమజ కామెంట్లు చేశారు.

టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాలో తాను కూడా నటించానని హిమజ పేర్కొన్నారు. సాధారణంగా ఏదైనా మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయితే నిర్మాత టెన్షన్ పడటం జరుగుతుందని ఈ సినిమా నిర్మాత అచ్యుత రామారావు మాత్రం షూటింగ్ క్యాన్సిల్ అయినా కూల్ గా ఉండేవారని హిమజ చెప్పుకొచ్చారు. వరుసగా విజయాలు అందుకుంటున్న హిమజ టెన్త్ క్లాస్ డైరీస్ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. లవ్ మ్యాటర్ ను బయటపెట్టిన హిమజ లవ్ ప్రపోజ్ చేసిన వ్యక్తి పేరు కూడా బయటపెట్టి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హిమజ సినిమా రంగంతో పాటు టీవీ రంగంలో కూడా ప్రతిభను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గడం లేదు. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే కమెడియన్ రోల్స్ లో కూడా హిమజ మెప్పిస్తున్నారు. హిమజ మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus