‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2′( హిట్ : సెకండ్ కేస్). అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అడివి శేష్ గత చిత్రాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.
‘మేజర్’ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది. కాబట్టి.. ‘హిట్2’ కి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది అని చెప్పాలి. ఒకసారి ‘హిట్ 2’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 3.92 cr |
సీడెడ్ | 1.46 cr |
ఉత్తరాంధ్ర | 1.32 cr |
ఈస్ట్ | 0.57 cr |
వెస్ట్ | 0.50 cr |
గుంటూరు | 0.79 cr |
కృష్ణా | 0.70 cr |
నెల్లూరు | 0.40 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.03 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.45 cr |
ఓవర్సీస్ | 2.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 12.98 cr (షేర్) |
‘హిట్ 2’ చిత్రానికి రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీగా పెద్ద క్రేజీ సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. ఈ మూవీ బాగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
శేష్ గత చిత్రం ‘మేజర్’ రూ.30 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. కాబట్టి ‘హిట్ 2’ చిత్రం టార్గెట్ ఈజీనే. అయితే పాజిటివ్ టాక్ వస్తేనే ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు వెళ్తున్నారు అనేది నిజం.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..