HIT 2 Twitter Review: అడివి శేష్ మరో ‘హిట్’ కొట్టాడా లేదా?

  • December 2, 2022 / 12:48 PM IST

‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని, నాని ల నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 2’. ‘హిట్’ మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. దానికి ఫ్రాంచైజీగా ‘హిట్ ‌2 ద సెకండ్ కేస్‌’ రూపొందింది. వరుస విజయాలతో ఫామ్లో ఉన్న హీరో అడివి శేష్ ఈ చిత్రంలో హీరో కావడంతో మంచి బజ్ ఏర్పడింది.టీజర్, ట్రైలర్ లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ డిసెంబర్ 2న అంటే మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది.

ఇక ఆల్రెడీ కొన్ని చోట్ల ‘హిట్2’ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ మొదట కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కథలోకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ బాగా వర్కౌట్ అయ్యిందని చెబుతున్నారు. అడివి శేష్ – మీనాక్షి చౌదరి ల కెమిస్ట్రీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందట. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి.. చాలా ఎంగేజ్ చేసిందని..

క్లైమాక్స్ పోర్షన్ అంతా ‘హిట్ 3’ పై ఆసక్తి రేపుతూనే మరోపక్క వచ్చే ట్విస్ట్ లు షాక్ కు గురిచేస్తాయని, ప్రేక్షకులు చెబుతున్నారు. సో ఓవరాల్ గా సినిమా ఆకట్టుకుంటుందని.. కచ్చితంగా అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ మూవీ అని సినిమా చూసిన ప్రేక్షకులు తెలిపారు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus