విస్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘హిట్’. నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిరి నేని కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. టైటిల్ కు తగినట్టుగానే ‘హిట్’ అనిపించుకుంది. ఇక వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్, ఎంగేజింగ్ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 2.54 cr |
సీడెడ్ | 0.39 cr |
ఉత్తరాంధ్ర | 0.47 cr |
ఈస్ట్ | 0.23 cr |
వెస్ట్ | 0.20 cr |
కృష్ణా | 0.26 cr |
గుంటూరు | 0.31 cr |
నెల్లూరు | 0.13 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.21 cr |
ఓవర్సీస్ | 0.96 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 5.70 cr (share) |
‘హిట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 5.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే సూపర్ హిట్ లిస్ట్ లో చేరిన ఈ చిత్రం.. తరువాతి వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే.. బ్లాక్ బస్టర్ లిస్ట్ లో కూడా చేరే అవకాశం ఉంటుంది. మరి ఆ అవకాశాన్ని ఈ చిత్రం ఎంత వరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి..!
Click Here to Read HIT Movie Review
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!