Pakka Commercial: అలా జరిగితే గోపీచంద్ ఖాతాలో సక్సెస్ చేరినట్టే!

  • June 17, 2022 / 01:36 PM IST

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హీరోలలో గోపీచంద్ ఒకరనే సంగతి తెలిసిందే. లౌక్యం తర్వాత గోపీచంద్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. జిల్, సౌఖ్యం, గౌతం నంద, ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్, పంతం, సీటీమార్, ఆరడుగుల బుల్లెట్ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ నటించిన సినిమాలు జులైలో విడుదలైతే బ్లాక్ బస్టర్ హిట్ అని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది.

గోపీచంద్ నటించిన కొన్ని సినిమాలు ఈ సెంటిమెంట్ నిజమేనని ప్రూవ్ చేశాయి. గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమా 2004 సంవత్సరం జులై 2వ తేదీన విడుదలై కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంది. గోపీచంద్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన లక్ష్యం 2007 సంవత్సరం జులై 6వ తేదీన విడుదలైంది. ఈ సినిమా నటుడిగా గోపీచంద్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది. గోపీచంద్ నటుడిగా తెరకెక్కిన సాహసం 2013 సంవత్సరం జులై 12వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

జులైలో విడుదలైన గోపీచంద్ సినిమాలేవీ మరీ తీవ్రస్థాయిలో ప్రేక్షకులను నిరాశపరచలేదు. మరోవైపు మారుతి సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ఇండస్ట్రీలో పేరుంది. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో పక్కా కమర్షియల్ ట్రైలర్ కు దాదాపుగా 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గోపీచంద్ తర్వాత సినిమా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించనున్నారు. భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. గోపీచంద్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు గోపీచంద్ కు క్రేజ్, మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus