అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు
- August 2, 2026 / 05:13 PM ISTByPhani Kumar
సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరోకరు ఏదో ఒక కారణంతో మరణిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండీ ఇండస్ట్రీ కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాపులర్ క్రైమ్ డ్రామా సిరీస్ అయినటువంటి ‘ది సోప్రానోస్’ ద్వారా వరల్డ్ వైడ్ పాపులర్ అయిన విన్సెంట్ పాస్టోర్(Vincent Pastore) ఈరోజు కన్నుమూశారు.
Vincent Pastore

ఆయన వయసు 80 ఏళ్ళు అని తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలోని తన స్వగృహంలో విన్సెంట్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో, సన్నిహితులు పోలీసులని సంప్రదించారట. విషయం తెలుసుకున్న పోలీసులు.. విన్సెంట్ నివాసానికి వెళ్ళగా… అక్కడ ఆయన మృతదేహం లభ్యమైనట్టు తెలుస్తోంది. అయితే విన్సెంట్ మరణానికి గల కారణాలు మాత్రం లభించలేదట. అయినప్పటికీ పోలీసులు దర్యాప్తు అయితే ఆపడం లేదు.
విన్సెంట్ హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా గ్యాంగ్‌స్టర్, టఫ్-గై తరహా విలక్షణ పాత్రలతో నిలధోక్కుకున్నారు. ‘ది సోప్రానోస్’ సిరీస్ లో చేసిన పాత్ర ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తర్వాత ‘గుడ్‌ఫెల్లాస్’, ‘కార్లిటోస్ వే’, ‘షార్క్ టేల్’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లతో కూడా ఈయన రేంజ్ పెరిగింది. మొత్తంగా 150కి పైగా సినిమాలు, వివిధ టెలివిజన్ సిరీస్‌లలో నటించారు విన్సెంట్. ఇక ఈయన మరణం పట్ల చింతిస్తూ.. కొందరు సెలబ్రిటీలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.











