Gautham Menon: వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్!

  • February 4, 2023 / 04:29 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు ఇప్పుడిప్పుడే ప్రశంసలు దక్కుతున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. అయితే తాజాగా గౌతమ్ మీనన్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తారక్ కు హాలీవుడ్ డోర్స్ ఓపెన్ అయ్యాయని గౌతమ్ మీనన్ కామెంట్లు చేశారు.

మన దేశం నుంచి ఇంటర్నేషనల్ సినిమాలలో నటించడానికి తారక్ కు గేట్లు ఓపెన్ అయ్యాయని ఆయన తెలిపారు. మన దేశం నుంచి మరి కొందరు స్టార్స్ సైతం హాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ మూవీస్ లో లేదా బాండ్ మూవీస్ లో మన దేశం హీరోలు నటించే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

హాలీవుడ్ సినిమాలలో ఛాన్స్ ను సొంతం చేసుకునే హీరో ఎవరో చూడటానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. తారక్ గురించి గౌతమ్ మీనన్ పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాబోయే రోజుల్లో తారక్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. తారక్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా కొరటాల శివ సినిమాతో తారక్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తారక్ సినిమాలు అంటే బడ్జెట్ విషయంలో సైతం నిర్మాతలు రాజీ పడటం లేదు. పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus