రియల్ లైఫ్ ఇన్సిడెన్స్ తో ఫన్ క్రియేట్ చేసే “మహాతల్లి” మరో క్యూట్ వీడియోతో ఈ బుధవారం మనముందుకు వచ్చేసింది. ఇప్పటి కాలంలో జరిగే పుట్టినరోజు వేడుకల వెనుక ఉన్న రహస్యాలను పోగు చేసి “హానెస్ట్ బర్త్ డేస్ ” అనే షార్ట్ ఫిలిం ని రూపొందించింది.
బర్త్ డే ముందు రోజు రాత్రి ఎప్పుడు 12 గంటలు అవుతుందా? అని ఎదురుచూడడం.. ఎవరెవరు విష్ చేస్తారని గుర్తు పెట్టుకోవడం.. పార్టీకి ఎవరిని పిలవాలని తల పట్టుకోవడం.. వచ్చిన ఫ్రెండ్స్ అడిగినవి సర్వే చేయడం.. పార్టీ బిల్ పెరిగిందని పేరెంట్స్ తో తిట్లు తినడం.. దాదాపు అందరి లైఫ్ లో జరిగే కామన్ పాయింట్స్ తో కామెడీ సృష్టించింది జాహ్నవి. మీరు కింద ఉన్న “హానెస్ట్ బర్త్ డేస్” వీడియోని చూసి మీ బర్త్ డే పార్టీ సంగతులను గుర్తుచేసుకొని హాయిగా నవ్వుకోండి.