Devara: ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ‘దేవర’ సెట్స్ లో ఏమైంది?

  • May 7, 2024 / 12:41 PM IST

ఎన్టీఆర్ (Jr. NTR) – కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్లో ‘దేవర’ (Devara) అనే సినిమా రూపొందుతుంది. ఆల్రెడీ ఈ కాంబోలో ‘జనతా గ్యారేజ్’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది కాబట్టి.. ‘దేవర’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే హీరోయిన్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. ఆల్రెడీ ‘దేవర’ నుండి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

దానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అనిరుధ్ (Anirudh Ravichander) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ అని అంతా ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. తాజాగా దేవర సెట్స్ లో ఊహించని సంఘటన చోటు చేసుకున్నట్లు వినికిడి. వివరాల్లోకి వెళితే.. ‘దేవర’ మూవీ సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 20 మంది గాయాలపాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ ను ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద నిర్వహిస్తున్నారు.

అయితే అనుకోని విధంగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయట. దీంతో 20 మంది గాయాలు పాలయ్యారట. ఈ క్రమంలో యూనిట్ సభ్యులతో కలిసి స్థానికులు.. గాయపడినవారిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం. మరోపక్క గాయపడిన వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడా? అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. దాని పై చిత్ర బృందం నుండి క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి కాస్త ఎక్కువగానే డిస్కషన్ జరుగుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus