Chiranjeevi, Balakrishna: వీరయ్య వర్సెస్ వీరసింహా.. మాస్ ఫ్యాన్స్ మెచ్చేలా?

  • January 8, 2023 / 12:24 AM IST

సంక్రాంతి పండుగ కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. వారసుడు మూవీ రిలీజ్ డేట్ మారనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని దిల్ రాజు టీం చెబుతోంది. వారసుడు సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్న దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని భావించడం లేదు.

మరోవైపు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ట్రైలర్లు ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ కాగా రెండు ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. రెండు ట్రైలర్లలో కథను ఎక్కువగా రివీల్ కాలేదు. వీరసింహారెడ్డి ట్రైలర్ కు డైలాగ్స్ హైలెట్ గా నిలవగా వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ కు మాత్రం చిరంజీవి, రవితేజ టైమింగ్ ప్లస్ అవుతున్నాయి. అభిమానులకు మాత్రం ఓ రేంజ్ లో నచ్చే విధంగా సినిమాల ట్రైలర్లు ఉన్నాయి.

మాస్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉన్న ఈ ట్రైలర్లు సినిమాలపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే మాత్రం బుకింగ్స్ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమరసింహారెడ్డి తరహా బాలయ్యను వీరసింహారెడ్డిలో చూడబోతున్నామని వింటేజ్ చిరంజీవిని వాల్తేరు వీరయ్యలో చూడబోతున్నామని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాలతో చిరంజీవి, బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారని సమాచారం. రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో శృతి అభిమానులు రెండు సినిమాలను చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ఏ రేంజ్ కలెక్షన్లు రాబోతున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus