‘ఆర్ఆర్ఆర్’ మీద ట్రోల్స్ మొదలయ్యాయి!

  • October 7, 2020 / 04:58 PM IST

అక్టోబర్ 22న తెలంగాణ తొలి గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమరం భీం జయంతి. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’లో భీం పాత్రలో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు. టీజర్ కోసం అవసరమైన షాట్స్ తియ్యడానికి సోమవారం షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రెండు విషయాలు చెప్పడానికి మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. రాజమౌళి మీద ట్రోల్స్ రావడానికి కారణమయ్యింది.

టీజర్ లో 1.18 మినిట్స్ దగ్గర రాయల్ ఎన్ ఫీల్డ్ రైజ్ చేస్తున్న షాట్ చూపించారు. రాజమౌళిని ట్రోల్ చెయ్యడానికి రీజన్ అదే. స్వాతంత్య్రం రావడానికి ముందు కాలం నాటి కథతో ‘ఆర్ఆర్ఆర్’ను తీస్తున్నారు. అప్పట్లో సెల్ఫ్ స్టార్ బైక్స్ ఎక్కడ వున్నాయని ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఇదీ లాజిక్కే. ఆ చిన్న లాజిక్ రాజమౌళి ఎలా మిస్ అయ్యారో మరి? రాజమౌళికి ట్రోల్స్ పేస్ చెయ్యడం కొత్త కాదు. ‘మగధీర’ టైమ్ నుండి ఆయన మీద విమర్శలు వస్తున్నాయి.

విమర్శలను పక్కన పెడితే ఆయన సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మీద నేషనల్ వైడ్ లో భారీ అంచనాలు వున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని వుహించవచ్చు.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus