Hrithik Roshan: హృతిక్ గర్ల్ ఫ్రెండ్.. ఒకప్పుడు అతనితో డేటింగ్?

బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కు సంబంధించిన డేటింగ్ రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. గ్లామరస్ హీరోయిన్‌ సబా ఆజాద్‌ తో డేటింగ్‌ చేసినట్లుగా గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియా అయితే వీరికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా వీరు ముంబైలో డిన్నర్‌ డేట్‌ కూడా వెళ్లినట్లుగా ఫొటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

విషయం బయటకు రావడంతో వీరికి సంబంధించిన గత ప్రేమలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక హృతిక్ తో ఉన్న సబా ఎవరని ఇంటర్నెట్ లో నెటిజన్లు ఆరా తీస్తున్నారు.సజా ఆజాద్‌ హృతిక్ రోషన్ కంటే ముందు వరకు చాలామందికి తెలియదు. కేవలం కొన్ని చిన్న సినిమాలతోనే ఆ బ్యూటీకి క్రేజ్ దక్కింది. ‘దిల్‌ కబడ్డీ’, ‘ముజే ఫ్రెండ్‌షిప్‌ కరోగే’, ‘రాకెట్‌ బాయ్స్‌’ వంటి సినిమాల్లో నటించింది.

అయితే హృతిక్ కంటే ముందు ఈ బ్యూటీకి ఓ లవ్‌ ట్రాక్‌ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా కొడుకుతో ఆమె అప్పట్లో చాలా రోజులు డేటింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇక ఇమాద్‌ తో 2013లో ప్రేమాయణం నడిపిన ఆ బ్యూటీ కొన్నేళ్ల వరకు బాగానే కొనసాగింది. ఇక ఏడేళ్లపాటు సహజీవనం చేసిన వాళ్ళు… అనంతరం ఏమైందో ఏమో గాని 2020 సంవత్సరంలో ఇమాద్‌, సబా విడిపోయారు.

ఇక ఇటీవల ముంబైలో ఆమె హఠాత్తుగా హృతిక్‌ చేయి పట్టుకుని నడవడం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య ఏదో కొనసాగుతోంది అని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక వారి మధ్య ననిజంగానే లవ్‌ మొదలైందా? లేక కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా అనే విషయంలో ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇక మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా కూడా కూడా ఈ జోడి వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus