కొంపముంచిన హృతిక్ ఫేస్ బుక్ పోస్ట్!

ఒక్కోసారి సమాధానమివ్వడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అని ఊరికే అనరు. పాపం గత నాలుగేళ్లుగా కంగనా విషయంలో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటూ వచ్చిన హృతిక్.. మొన్నామధ్య కంగనా చెల్లెలు రంగోలి ట్విట్టర్ సాక్షిగా రెచ్చిపోయేసరికి వేరే దారిలేక ఫేస్ బుక్ లో ఓ మూడు పేజీల లెటర్ పోస్ట్ చేశాడు హృతిక్ రోషన్. తాను కంగనాతో ఎలాంటి రిలేషన్ మెయిటైన్ చేయలేదని, కేవలం ఒక హీరోయిన్ గా మాత్రమే తాను కంగనాతో కలిసి నటించాననే విషయాన్ని కాస్త వివరంగా వివరించాడు హృతిక్ రోషన్.

అయితే.. హృతిక్ ఇచ్చిన భారీ స్టేట్ మెంట్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు మరియు హృతిక్ సన్నిహితుల నుంచి పాజిటివ్ రెస్పాన్ బానే వచ్చింది కానీ మిగతా సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ మాత్రం హృతిక్ పై సర్కాస్టిక్ గా విరుచుకుపడ్డారు. “మీ గొడవలేమైనా ఉంటే బయట చూసుకోండి.. ఇలా ట్విట్టర్ లో గోల చేసి మాకు పిచ్చెక్కించకండి” అంటూ విరుచుకుపడ్డారు.

పాపం ఈ తరహా రెస్పాన్స్ ను ఏమాత్రం ఎక్స్ పెక్ట్ చేయని హృతిక్ అండ్ అతడి పి.ఆర్ టీం ఇప్పుడు ఈ ఫేస్ బుక్ పోస్ట్ తో జరిగిన డ్యామేజ్ ను ఎలా కవర్ చేయాలో అర్ధం కాక తలలు పట్టుకొన్నారు. అయితే.. ఇప్పుడు హృతిక్ ఫేస్ బుక్ పోస్ట్ గురించి కంగనా ఎలా రెస్పాండ్ అవుతుందా అని హృతిక్ హేటర్స్ తోపాటు కంగనా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus