పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాకు బడ్జెట్ ఫిక్స్

  • October 4, 2016 / 11:42 AM IST

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయించే స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆయన చిత్రం “అత్తారింటికి దారేది” మూడేళ్ల క్రితమే వందకోట్లను మార్కుని దాటి రికార్డు సృష్టించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసి పవన్ సత్తాను చాటింది.

ఇప్పుడు పవన్ డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమా చేస్తున్నారు. తొలిసారి ఫ్యాక్షనిస్టుగా పవన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ కి పూర్తి కానుంది. దీని తర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ డైరక్షన్లో సినిమా చేయడం ఖరారు అయింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో  నిర్మాత రాధాకృష్ణ నిర్మించనున్న ఈ మూవీ కి “దేవుడే దిగివ‌చ్చినా” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని వందకోట్లు ఖర్చు చేసేందుకు నిర్మాత  సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. త్రివిక్రమ్ ఈ సారి కథలో లవ్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఎన్నికోట్లు వసూలు చేస్తోందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus