Prabhas: అలా జరుగుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారా?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అంటే విడుదలకు ముందు విడుదల తర్వాత సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని ప్రభాస్ అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు. సలార్ మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కేజీఎఫ్2 ఇండస్ట్రీ హిట్ కావడంతో సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. తాజాగా సలార్ సినిమా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ వెరిఫై కాగా ఈ ట్విట్టర్ అకౌంట్ కు కేవలం 24 గంటల వ్యవధిలో 45,000కు పైగా ఫాలోవర్లు వచ్చారు.

ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు ఈ విధంగా జరగలేదు. రోజురోజుకు సలార్ ట్విట్టర్ అకౌంట్ లో ఫాలోవర్ల సంఖ్య అంచనాలకు మించి పెరుగుతుండగా ప్రభాస్ ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తున్నారు. సలార్ పై ఉన్న హైప్ కు ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలలో ఏ సినిమా క్రియేట్ చేయని స్థాయిలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం. సలార్ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ లుక్ ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉండనుందని ఇప్పటికే రిలీజైన, లీకైన పోస్టర్లు, ఫోటోల ద్వారా క్లారిటీ వచ్చింది. సలార్ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా శృతి హాసన్ పాత్రకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

శృతి హాసన్ జర్నలిస్ట్ రోల్ లో నటిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారానికి సంబంధించి చిత్రయూనిట్ స్పందించలేదు. సలార్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus