భారీ ధరకు అమ్ముడైన ‘శాతకర్ణి’ ఓవర్సీస్ హక్కులు..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘గౌతమపుత్ర శాతకర్ణి’ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ మొరాకోలో జరుపుకుంటుండగా.. అక్కడ పలు యుద్ద సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లో ఉండగానే చిత్ర ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం.

ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులు 9పి‌ఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిబాబు, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు టాక్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus