Thank you, The Warriorr: థాంక్యూ, వారియర్ సినిమాల ఫలితాలు మారతాయా?

Advertisement

2022 సంవత్సరం జులై నెలలో చాలామంది హీరోలు అదృష్టాన్ని పరీక్షించుకోగా ఆ హీరోలకు భారీ షాక్ తగిలింది. గత నెలలో వారం రోజుల గ్యాప్ లో ది వారియర్ థాంక్యూ సినిమాలు విడుదలయ్యాయి. ది వారియర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోగా థాంక్యూ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది. ఈ రెండు సినిమాల వల్ల నిర్మాతలకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు ఓటీటీలో విడుదల కానున్నాయి.

ది వారియర్ మూవీ ఈ నెల 11వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో థాంక్యూ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ఓటీటీలలో హిట్ అవుతాయని రామ్, నాగచైతన్య అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలు ఓటీటీలలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

ఈ రెండు సినిమాలపై ప్రముఖ ఓటీటీ సంస్థలు సైతం భారీగా ఆశలు పెట్టుకున్నాయి. నాగచైతన్య ముఖ్య పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా థియేటర్లలో విడుదలవుతున్న రోజునే థాంక్యూ మూవీ ఓటీటీలో విడుదలవుతుండటం గమనార్హం. నాగచైతన్య, రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్య, రామ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఈ ఇద్దరు మిడిల్ రేంజ్ హీరోలు నటిస్తుండటం గమనార్హం. ఈ ఇద్దరు హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. నాగచైతన్య వెంకట్ ప్రభు, పరశురామ్ డైరెక్షన్ లో నటిస్తుండగా రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తుండటం గమనార్హం. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోలు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read