శ్రీదేవి భర్త బోణికపూర్ చాలా వరకు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 10రూపాయలు మళ్ళీ వెనక్కి తేవాలి అనే రకం. అయితే అలాంటి నిర్మాత కెరీర్ లో మరోసారి అత్యంత భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నిర్మాతగా కెరీర్ మొదట్లోనే చేతులు కాల్చుకున్న బోణి కపూర్ ఇప్పుడు మరోసారి తౌక్తే తుఫాన్ ధాటికి 30కోట్లు పోగొట్టుకున్నాడు. బోణి కపూర్ ఎంతో ప్లానింగ్ తో సినిమాలు నిర్మిస్తుంటారు.
గత ఐదారేళ్లుగా ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది. ముఖ్యంగా పింక్ సినిమాతోనే బోణి కపూర్ భారీ స్థాయిలో లాభాలు అందుకున్నాడు. మళ్ళీ అదే సినిమాను తమిళ్ కూడా నిర్మించి హిట్టు కొట్టారు. ఇక తెలుగులో కూడా వకీల్ సాబ్ గా రీమేక్ చేసి దిల్ రాజుతో వాటాలు పంచుకున్నారు. అయితే ఆయన ఇటీవల సంపాదించిన మొత్తం కూడా మైదాన్ సినిమా కోసమే ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు.
అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఆ సినిమా కోసం ముంబైలో భారీ సెట్ నిర్మించగా మొదట లాక్ డౌన్ వల్ల ఆలస్యం కావడంతో మరొకటి నిర్మించారు. అలాగే కరోనా వల్ల మొత్తం మూడుసార్లు నిర్మించడంతో ఇప్పుడు కూడా ముంబైలో తుఫాను కారణంగా సెట్ సగం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక మొత్తం 30కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని బోణి కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!