టాలీవుడ్ లో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు. మొదటి నుంచి కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిర్మాతల కారణంగా ఈ హీరో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. నిజానికి ఇండస్ట్రీలో హీరోలు రెమ్యునరేషన్స్ తీసుకోకుండా పని చేయరు. తమకు రావాల్సినంత మొత్తాన్ని నిర్మాతల దగ్గర వసూలు చేస్తారు. నిర్మాతల చేతుల్లో మోసపోయే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో శ్రీవిష్ణు పేరు ముందుంటుందని అంటున్నారు.
రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ.. సినిమా బాగా ఆడితే, నిర్మాత బాగుపడితే చాలు అనే మంచి ఆలోచన అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. ‘బ్రోచేవారెవరురా’ సినిమా తరువాత శ్రీవిష్ణు కెరీర్ మారుతుందేమో అనుకున్నారు. కానీ దీని తరువాత కూడా అతడి సినిమాలకు సరైన బిజినెస్ జరగడం లేదు. అతడి సినిమాలకు ఎక్కువ ఖర్చు కూడా పెట్టరు. లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు తీస్తారు. పేరున్న నిర్మాతలైతే సినిమాలకు బిజినెస్ చేసుకొని..
నష్టాలు రాకుండా చూసుకునేవారు. కానీ శ్రీవిష్ణు ఏ నిర్మాతలతో అయితే పని చేశారో వారి ఫెయిల్యూర్ కారణంగా అతడి సినిమాలు మరింత దెబ్బ తిన్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘అల్లూరి’ సినిమా విషయంలో అయితే శ్రీవిష్ణుకి ఆదాయం తెచ్చిపెట్టకపోగా.. తన జేబులోనుంచి డబ్బులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫైనాన్స్ క్లియర్ చేయలేకపోవంతో సినిమాకి మార్నింగ్ షోలు పడలేదు.
దీంతో శ్రీవిష్ణు ఆ డబ్బులు సెటిల్ చేసి సినిమాను రిలీజ్ చేయించాడు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. కలెక్షన్స్ కూడా లేవు. దీంతో నిర్మాతలు సైడ్ అయిపోయారు. శ్రీవిష్ణుకి రావాల్సిన రెమ్యునరేషన్ కూడా రాలేదట. అందుకే ఇకపై పేరున్న బ్యానర్లలోనే పని చేయాలని నిర్ణయించుకున్నారు ఈ హీరో.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!