Ketika Sharma: రొమాంటిక్ పిల్లపై అగ్ర దర్శకుల ఫోకస్!

  • October 28, 2021 / 01:35 PM IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కొత్త బ్యూటీలు రావాలి అని చాలా మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సీనియర్ స్టార్ హీరోలు ప్రస్తుతం ఉన్న దాదాపు అందరి స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించేశారు. దీంతో కొత్త హీరోయిన్స్ తో నటించాలని వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అగ్ర దర్శకులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అయితే సరైన సమయంలోనే కేతికా శర్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అర్థమవుతోంది.

ఈ బ్యూటీ గతంలోనే సోషల్ మీడియాలో చాలా మంది కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసింది. తన హాట్ స్టిల్స్ తో పలు ఆడిషన్స్ లో కూడా పాల్గొంది ఇక పూరి జగన్నాథ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫైనల్ చేసశారు. మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ రొమాంటిక్ సినిమాలో చాలా హాట్ గా కనిపించి నట్లు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా అగ్ర దర్శకులు రొమాంటిక్ సినిమా స్పెషల్ షోను చూసి ఎక్కువగా కేతికా శర్మ పై ప్రశంసలు కురిపించారు.

చూస్తుంటే అమ్మడు ఈజీగా కొంతమంది దర్శకుల సినిమాల్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఎలాగైతే వరసగా ఆఫర్స్ అందుకుంటుందో అదే తరహాలో రొమాంటిక్ సినిమా విడుదల కాకముందు కేతిక శర్మ కొన్ని ఆఫర్స్ అయితే అందుకుంది. మరి రొమాంటిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus