Akhil: ఇది కనుక వర్కౌట్ అయితో అఖిల్ లెక్కే వేరంట.. డైరెక్టర్ ఎవరంటే..!

  • January 5, 2023 / 07:45 PM IST

కింగ్ నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేనిని ‘సిసింద్రీ’ తో చిన్నప్పుడే స్టార్‌ని చేసేశారు.. ‘మనం’ క్లైమాక్స్‌లో జస్ట్ అలా చూపించి.. ‘అఖిల్’ తో భారీ స్థాయిలో లాంచ్ చేశారు. తర్వాత వచ్చిన రెండు సినిమాల పరిస్థితి కూడా తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అఖిల్‌కి కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేస్తూ.. స్టార్‌గా నిలబెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు నాగ్..

ప్రస్తుతం పరిశ్రమతో పాటు ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏజెంట్’ మీదనే ఉంది.. సరికొత్త మేకోవర్‌తో హాలీవుడ్ హీరోలా మారిపోయాడు అఖిల్.. నో డౌట్.. పక్కా హిట్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు టీమ్. ఇదిలా ఉంటే అఖిల్ బాబు తర్వాత సినిమా పలానా దర్శకుడితో చేయబోతున్నాడు అంటూ కొద్ది రోజుల నుండి వార్తలు వస్తుండడం చూశాం. వారిలో వంశీ పైడిపల్లి, బోయపాటి, మిత్రన్, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు వచ్చాయి.

ఇప్పుడు దాదాపు అఖిల్ ఆరవ సినిమా ఖరారైపోయినట్టే కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అంటూ అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ అనే కొత్త కుర్రాణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో.. యూవీ క్రియేషన్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనుందని అంటున్నారు.

ఇక ఈ క్రేజీ న్యూస్ చూసిన అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.. దీన్ని సామాజిక మాధ్యమాలలో బాగా స్ప్రెడ్ చేస్తున్నారు.. ‘ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితో అఖిల్ లెక్కే వేరే’.. ఈసారి బాబు పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోవడం పక్కా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అఖిల్ ఐదో సినిమా ‘ఏజెంట్’ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus