మహేష్ బాబు చిత్రం ఓవర్సీస్ కలక్షన్స్ పై చర్చ

  • February 6, 2017 / 07:56 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి గిరాకీ ఉంటుంది. ఇక్కడ బాగా ఆడని చిత్రాలు సైతం అక్కడ భారీ కలక్షన్స్ రాబట్టాయి. అందుకే ప్రిన్స్ సినిమాను కొనేందుకు విదేశీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతుంటారు. ప్రస్తుతం మహేష్ తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇన్వెస్ట్ గేట్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ ఫిల్మ్ ఇప్పటికీ 80 శాతం కంప్లీట్ చేసుకుంది.  సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలయింది. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ని బట్టి నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ ఓవర్సీస్ రైట్స్ 25  కోట్లు చెబుతున్నారు.

ఈ రేటు విని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ షాక్ తిన్నారు. “మహేష్ కెరీర్లో ఇండస్ట్రీ  హిట్ గా నిలిచిన శ్రీమంతుడు ఓవర్సీస్ లో 19 కోట్లు వసూలు చేసింది. మహేష్ 23 మూవీ 25 కోట్లకు పైగా వసూలు చేస్తుంది” అని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్రం హిట్ అయితే పరవాలేదు, ఫెయిల్ అయితే తమ పరిస్థితి ఏమిటని పంపిణీ దారులు ఆలోచనలో ఉన్నారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ఎంతమేరకు అమ్ముడుపోతుందో త్వరలో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus