భారీ రెమ్యునరేషన్ అందుకున్న శ్రీదేవి కుమార్తె

మరాఠీలో తెరకెక్కిన సైరత్ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఆ ప్రేమ కథతో తన కుమార్తె జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తిరుగుండదని శ్రీదేవి అలోచించి ఒకే చెప్పింది. ఈ సినిమాతో గ్రాండ్ గా పరిచయం చేయడానికి సిద్ధమైంది. కానీ దేవుడు స్క్రిప్ట్ మరోలా రాసాడు. హఠాత్తుగా ఆమెను తీసుకెళ్లిపోయాడు. అయినా జాన్వీ కుంగిపోకుండా తల్లికి తగ్గ కూతురిగా నిరూపించుకోవాలని కష్టపడి నటించింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ధడక్ గా వచ్చే నెల రిలీజ్ కాబోతోంది. ఇషాన్ హీరోగా నటించిన ఈ చిత్ర ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో చూసిన వారందరూ జాన్వీకి ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. జాన్వీ కి ఇది తొలి చిత్రం అయినప్పటికీ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

45 లక్షలు జాన్వీ అందుకున్నట్టు సమాచారం. అలాగే షూటింగ్ సమయంలో ఆమె ఖర్చులకు మరో ఐదు లక్షలు అయి ఉంటుందని టాక్. సో అరకోటి అందుకొని ఔరా అనిపించుకుంది. కొత్త హీరోయిన్స్ కి పది లక్షలు ఇస్తుంటారు. జాన్వీ కి ఉన్న క్రేజ్ బట్టి ఇంతమొత్తం ఇచ్చారని సినీ వర్గాలు వెల్లడించాయి. హీరో ఇషాన్ 70 లక్షలు అందుకున్నారంట. దర్శకుడు శశాంక్ కూడా బాగానే అందుకున్నట్టు తెలిసింది. డైరక్టర్ 4 కోట్లు.. రచయిత నాగరాజ్ కు రెండు కోట్లు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిన ఈ మూవీ ఎంత మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus