Koratala Siva: ఎన్టీఆర్ మూవీతో ప్రూవ్ చేసుకోకపోతే కొరటాలకు కష్టమేనా?

  • March 3, 2023 / 05:55 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత వరుస విజయాలతో అదే స్థాయిలో సంచలనాలు సృష్టించిన దర్శకుడిగా కొరటాల శివకు పేరుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను విజయాలతో కొరటాల శివ పేరు మారుమ్రోగింది. తన సినిమాలలో మెసేజ్ ఉండేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాలను తెరకెక్కిస్తారని ఇండస్ట్రీలో పేరుంది. అయితే ఆచార్య ఫలితంతో కొరటాల శివతో సినిమా చేయాలంటే స్టార్ హీరోలు సైతం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని సంవత్సరాల క్రితమే బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టేనని సమాచారం. వరుస సినిమాలతో బిజీ అవుతున్న బన్నీ ఈ సినిమా గురించి ఎక్కడా నోరు మెదపడం లేదు. తాజాగా అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తన తర్వాత సినిమాను ప్రకటించారు. సుకుమార్ సినిమా పూర్తైన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్న బన్నీ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటించనున్నారు.

బన్నీ పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అల్లు అర్జున్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వరుసగా ఇండస్ట్రీ హిట్లు సాధించేలా బన్నీ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా బన్నీతో సినిమా చేయాలని ఆశ పడుతున్న దర్శకుల సంఖ్య తక్కువేం కాదు. అల్లు అర్జున్ రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నా సినిమా సినిమాకు లుక్ విషయంలో వేరియేషన్ ఉండేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అల్లు అర్జున్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా సిద్ధమేనని సమాచారం. బన్నీ కెరీర్ ప్లానింగ్ ను ఇతర హీరోలు సైతం ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే మాత్రమే కొరటాల శివకు కొత్త సినిమా ఆఫర్లు వస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమా కొరటాలకు అగ్ని పరీక్ష అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus