ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గత కొన్నేళ్లుగా నైజాంలో హవా కొనసాగిస్తున్నారు. నైజాంలోని ముఖ్యమైన థియేటర్లు దిల్ రాజు చేతిలోనే ఉండటంతో నిర్మాతలు సైతం దిల్ రాజుకు పెద్ద సినిమాల హక్కులు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం దిల్ రాజు చెబుతున్న లెక్కల విషయంలో ఏ మాత్రం సంతృప్తితో లేరని సమాచారం అందుతోంది. దిల్ రాజుకు పోటీగా వరంగల్ శ్రీను ఎంట్రీ ఇచ్చినా ఈ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేసిన ఆచార్య,
లైగర్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఫలితాల వల్ల వరంగల్ శ్రీను భారీ సినిమాలను కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు నైజాం ఏరియాలోకి సీడెడ్ కు చెందిన శశి ఎంట్రీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. బ్యాగ్రౌండ్ బలంగా ఉన్న శశి రిస్క్ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని సమాచారం అందుతోంది. మైత్రీ నిర్మాతల సపోర్ట్ తో శశి నైజాం ఏరియాలోకి రానున్నారని బోగట్టా.
టాలీవుడ్ సినిమాలకు నైజాం ఏరియా కీలకం కాగా ఈ ఏరియాలో రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల హక్కులకు గట్టి పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఫైనాన్షియల్ గా కూడా శశి బలమైన వ్యక్తి కావడం గమనార్హం. శశికి టాలీవుడ్ కు చెందిన పలువురు నిర్మాతలతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. నైజాం ఏరియాలో రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల హక్కులను కొనుగోలు చేయడం పెద్దపెద్ద డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే సాధ్యమవుతుంది.
నైజాం ఏరియాలో దిల్ రాజుకు భారీ షాక్ తగిలే దిశగా అడుగులు పడుతున్నాయి. మైత్రీ నిర్మాతలు వరుసగా సినిమాలను నిర్మిస్తుండగా ఈ నిర్మాతల సినిమాలకు శశి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. నైజాంలో కొత్త డిస్ట్రిబ్యూటర్ల ఎంట్రీలో దిల్ రాజుకు వరుస షాకులు తగులుతుండగా దిల్ రాజుకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.