చరణ్ శంకర్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 80 శాతం షూటింగ్ పూర్తైంది. ఈ సినిమా 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే కమల్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్2 సినిమా కూడా థియేటర్లలో అదే సమయానికి రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న ఈ వార్త ఫ్యాన్స్ ను సైతం ఒకింత అయోమయానికి గురి చేస్తోంది.
శంకర్ సినిమాతో శంకర్ సినిమా పోటీ పడితే రెండు సినిమాలకు నష్టం కలుగుతోంది. గతంలో పలువురు స్టార్ హీరోలు నటించిన రెండు సినిమాలు ఈ విధంగా ఒకే సమయంలో థియేటర్లలో విడుదలైన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఒకే డైరెక్టర్ సినిమాలు రిలీజ్ కావడం మాత్రం శంకర్ సినిమా విషయంలో మాత్రమే జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చరణ్ శంకర్ కాంబో మూవీ 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
దిల్ రాజు బ్యానర్ తో పాటు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దిల్ రాజు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తున్నారు. శంకర్ కు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అవసరం అనే సంగతి తెలిసిందే. చరణ్ సైతం శంకర్ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు.
రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొననున్నారు. చరణ్ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిర్మాతలకు ప్రయోజనం చేకూరేలా చరణ్ నిర్ణయాలు తీసుకుంటారని సినిమాకు నష్టం వస్తే చరణ్ డబ్బులు వెనక్కు ఇస్తారని టాక్ ఉంది. రామ్ చరణ్ వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!