Sonu Sood: సోనూసూద్ ప్రైమ్ మినిష్టర్ అవ్వాలి: హుమా ఖురేషి

  • June 1, 2021 / 12:29 PM IST

ఏ క్షణంలో సోనూసూద్ మనసులో సహాయం అనే పదం పుట్టిందో గాని గత ఏడాది నుంచి అలుపు లేకుండా అతను చేస్తున్న పనులకు నిజంగానే దేవుడయ్యాడు. కేవలం సహాయం పొందిన వారికే ఆయన విలువ ఏమిటో తెలుస్తుంది అనుకుంటే పొరపాటే. సోనూసూద్ చేస్తున్న మంచి పనులు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలుస్తున్నారు. సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తే మరింత సహాయలు చేయగలడు అని చాలామంది జనాలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సినీ ప్రముఖులు కూడా అది నిజం కావాలని కోరుకున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ హుమా ఖురేషి కూడా ఏకంగా ఆయన ప్రైమ్ మినిష్టర్ అవ్వాలి అంటూ.. సోనూసూద్ నలుగురికి ఉపయోగపడే మనిషి అంటూ అలాంటి వ్యక్తికి ఒక బాధ్యతను ఇస్తే తప్పకుండా దానికి న్యాయం చేయగలడని అన్నారు. అంతే కాకుండా ఎన్నికల బరిలో నిలబడితే తన ఓటు కూడా సోనూసూద్ కు వేస్తానని చెబుతూ..

మంచి మనసుతో సోనూసూద్ చేస్తున్న పనులు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని హుమా ఖురేషి వివరణ ఇచ్చింది. ఇక సోనూసూద్ దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్యను తగ్గించడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో ప్లాంట్ కోసం మూడు కోట్లకు పైగా ఖర్చు చేస్తూ సోనూసూద్ తన మంచితనానికి అడ్డు లేదని నిరూపిస్తున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus