నా సాయం త్రివిక్రమ్ గారికి అక్కర్లేదు : హైపర్ ఆది

  • February 20, 2019 / 05:58 PM IST

‘జబర్దస్త్’ షోలో నాన్ స్టాప్ పంచ్ డైలాగులు వేస్తూ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు కమెడియన్ హైపర్ ఆది. ఈ షో నుండీ వచ్చిన పాపులారిటీ తో సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది. ఇక పంచ్ లు వేయడంలో ఆదిని కొట్టేవారే లేరని చాలామంది ఆదిని ప్రశంసిస్తూ ఉంటారు. అయితే ఇటీవల మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని కలిశాడట హైపర్ ఆది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో త్రివిక్రమ్ చిత్రానికి ఆది పంచ్ డైలాగ్స్ రాస్తున్నాడని వార్తలు మొదలయ్యాయి.

తాజాగా ఈ వార్తల పై ఆది క్లారిటీ ఇచ్చాడు. హైపర్ ఆది ఈ విషయం పై స్పందిస్తూ… “త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే ఆయన్ని మూడు సార్లు కలిసాను. కేవలం అభిమానంతో మాత్రమే కలిశాను తప్ప అంతకుమించి మరేమీ లేదు. త్రివిక్రమ్ గారి చిత్రాలకి మాటలు, పంచ్ డైలాగులు రాసేంత పెద్దవాడిని కాను. త్రివిక్రమ్ గారు.. ఆయన తీసే సినిమాలకు కథ, మాటలు ఆయనే రాసుకుంటారు … ఆయనకి ఎవరి సాయం అవసరం లేదు. నాతో మాటలు రాయించుకోవాల్సిన అవసరం త్రివిక్రమ్ గారికి లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus